
రేషన్ బియ్యం స్వాధీనం
సంగం: మండలంలోని సిద్ధీపురం వద్ద జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు మంగళవారం రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ట్రక్ ఆటో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు.
84 బస్తాలు
ఆత్మకూరు: బొలెరో వాహనంలో నెల్లూరుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా ఆత్మకూరు మండలంలోని వాశిలి సమీపంలో ఎస్సై ఎస్‌కే జిలానీ మంగళవారం పట్టుకున్నారు. వివరాలు.. ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల పరిధిలోని గ్రామాల్లో సేకరించిన 84 బస్తాలను బొలెరోలో లోడ్ చేసుకుని వెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. వాహనాన్ని, అందులోని ఇద్దరు వ్యక్తులను స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు వివరించారు.

రేషన్ బియ్యం స్వాధీనం