
నేటి నుంచి అండర్ 19 స్కూల్ గేమ్స్
నెల్లూరు(టౌన్): 69వ సూల్స్ గేమ్స్ అండర్ 19 జిల్లా స్థాయి పోటీలు బుధవారం నుంచి జరుగుతాయని ఆర్‌ఐఓ వరప్రసాదరావు, డీవీఈఓ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో ఉమ్మడి నెల్లూరుకు చెందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ఏపీ రెసిడెన్షియల్స్, ఏపీ సోషల్ వెల్ఫేర్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ మోడల్స్ స్కూల్స్, కేజీబీవీ, హైస్కూల్ ప్లస్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ అధ్యాపకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. షెడ్యూల్, వేదికలు, విధివిధానాలను వివరించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి, స్కూల్ గేమ్స్ సెక్రటరీ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.