
ఆర్టీసీ ఖాళీ స్థలాలు వినియోగించుకోవాలి
● ఎండీ ద్వారకా తిరుమలరావు
ఆత్మకూరురూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలకు సంబంధించిన ఖాళీ స్థలాలను ఓస్ – 15 పథకం కింద సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపోను మంగళవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపో ప్రాంగణాలను పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీ్త్ర శక్తి పథకాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. గ్యారేజీ సిబ్బంది, సూపర్‌వైజర్లు, అధికారుల పనితీరును పరిశీలించి వారిని అభినందించారు. ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న 10 మందికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సురేష్‌రెడ్డి, డిపో మేనేజర్ శివకేశ్ యాదవ్, ఈడీ అప్పలరాజు, నాగేంద్ర, డీటీపీఓ షమీమ్, అసిస్టెంట్ డీఎం రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.