
తాగునీటి కోసం నిరసన
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలంలోని ఏ కిస్తీపురం పంచాయతీ పరిధిలో ఉన్న చింతలపాళెంలో మూడునెలలుగా తాగునీటి సమస్య ఉంది. దీని గురించి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ సోమవారం గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ గ్రామంలో పంచాయతీ పాలకవర్గానికి, కార్యదర్శికి, పలువురు అధికారులకు తాగునీటి సమస్యను తెలియజేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు దొరక్క అనేక కుటుంబాలు గ్రామం వదిలి వెళ్లిపోయాయని, మరికొన్ని వలసబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికార పార్టీకి చెందిన కొందరు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎంపీడీఓ స్పందిస్తూ రెండు రోజుల్లో బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.