
గ్రామస్తులు చికెన్ వ్యర్థాల వాహనాన్ని అడ్డుకొని ఆందోళన
ముత్తుకూరు(పొదలకూరు): చికెన్ వ్యర్థాల వాహనాన్ని మండలంలోని తాళ్లపూడి పంచాయతీ బసరాలదిబ్బలో గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. దుర్గంధాన్ని భరించలేకపోతున్నామంటూ వాహనాన్ని అధికార పార్టీ నేతలే అడ్డుకొని పోలీసులకు సమాచారమిచ్చారు.
చేపల చెరువుల్లో మేతగా వేసేందుకు గానూ బెంగళూరు నుంచి కోళ్ల వ్యర్థాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఈ ప్రాంతానికి వాహనం ప్రతి శుక్రవారం రాత్రి వచ్చి శనివారం వెళ్తోంది. వాహన రాకను గ్రామస్తులు గమనించి, దాన్ని అడ్డుకొని ఆందోళనను చేపట్టారు. ఈ ప్రాంతానికి రాకుండా కట్టడి చేయాలని కోరుతూ పోలీసులకు సమాచారమిచ్చారు.