
ఎంపీడీఓ కార్యాలయంలో తనిఖీ
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ మోహన్‌రావు ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. మండల పరిషత్ లావాదేవాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యాలయ సిబ్బంది సమయపాలనను పాటించాలని కోరారు. నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. స్వచ్ఛభారత్‌ను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.కోటి వరకు మండల పరిషత్‌కు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో ప్రాధాన్య క్రమంలో ఖర్చు చేయాలని పేర్కొన్నారు.