
వేళాంగణిమాత మహోత్సవాలు ప్రారంభం
తోటపల్లిగూడూరు: కోడూరులో వేళాంగణిమాత ఉత్సవాలు అట్టహాసంగా శనివారం ప్రారంభమయ్యాయి. పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ లూకాస్‌రాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను జరిపారు. మరియమాత – రక్షణ సహకారిణి అనే అంశంపై భక్తులకు దైవ సందేశాన్ని పలువురు అందించారు. మరియమాత తేరు ప్రదక్షిణ కార్యక్రమాన్ని ముత్యాలతోపు మీదుగా మహాలక్ష్మీపురం వరకు సాగింది. ప్రార్థనల అనంతరం స్థానికంగా ఉన్న కోడూరు బీచ్‌లో సముద్ర స్నానాలను స్థానికులు ఆచరించారు.
ఉత్సవాల్లో నేడు
వేళాంగణి మాత ఉత్సవాల్లో భాగంగా ఉదయకాల ప్రార్థన, ఆరాధన – స్వస్థత ప్రార్థనలు, దివ్య బలిపూజ, పరిశుద్ధ జపమాల తదితరాలను ఆదివారం నిర్వహించనున్నారు. వేళాంగణి చర్చి నుంచి కొత్తకోడూరు వరకు వేళాంగణిమాత విగ్రహ తేరుప్రదక్షిణ రాత్రి 8.30కు జరగనుంది.