
భక్తిశ్రద్ధలతో మిలాద్ – ఉన్ – నబీ
నెల్లూరు(బృందావనం): మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని మిలాద్ – ఉన్ – నబీని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నగరంలోని మసీదుల్లో ప్రత్యేక దువా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో అన్నదానం కార్యక్రమాలను చేపట్టారు. జెండావీధి కోటమిట్ట వద్ద ఉన్న అమీనియా మసీదు నుంచి సంప్రదాయంగా ప్రదర్శన నిర్వహించారు. ఇందులో మతపెద్దలు, ఇమామ్‌లు, మౌ ల్వీలు ముస్లింలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ప్రదర్శన జెండావీధి కోటమిట్ట వద్ద ఉన్న అమీనియా మసీదు నుంచి ప్రారంభమై మెయిన్‌రోడ్డు షాదీమంజిల్, చేపల మార్కెట్, వహబ్‌పేట, బారకాసు సెంటర్, ఆచారివీధి, మద్రాస్ బస్టాండ్, వీఆర్సీ, గాంధీబొమ్మ, ఏసీ సెంటర్, ములుముడి బస్టాండ్, చిన్నబజారు, పెద్దబజారు మీదుగా కోటమిట్ట చేరింది. ఇందులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, ఆ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో మిలాద్ – ఉన్ – నబీ