
మెడికవర్‌లో వాస్కులర్ సర్జరీ సేవలు ప్రారంభం
నెల్లూరు(అర్బన్): నగరంలోని మెడికవర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నెల్లూరులోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో వాస్కులర్, ఎండో వాస్కులర్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభించామని ఆ విభాగం కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెన్త్నె, హైదరాబాద్‌కు వెళ్లే అవసరం లేకుండా సేవలందిస్తున్నామన్నారు. మధుమేహ రోగుల్లో రక్త ప్రసరణ తగ్గినప్పుడు కాలి వేళ్లు, కాలు తీసేయాల్సిన అవసరం లేకుండా వైద్యం చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదంలో రక్తనాళాలు దెబ్బతింటే వాటికి సర్జరీ చేసి సరి చేయడం జరుగుతుందన్నారు. డయాలసిస్ కోసం ఫిస్టులా గ్రాఫ్ట్ శస్త్రచికిత్సలు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో నిర్వహిస్తామన్నారు సెంటర్ హెడ్ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పూర్తి స్థాయి సేవలందించే వాస్కులర్ సర్జన్ విభాగం మెడికవర్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ డా.అభిజిత్, మార్కెటింగ్ హెడ్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.