
ఎనిమిది వారాలు పనిచేశాం
ఉపాధి పనులకు గతంలో రోజూ హాజరయ్యేవాళ్లం. ఎనిమిది వారాలు పనులు చేయగా, రెండు వారాలకే డబ్బులు పడ్డాయి. ఇప్పటివరకు మిగిలిన మొత్తాన్ని ఇవ్వలేదు. గ్రామాల్లో పనులనూ కల్పించడంలేదు.
– లక్ష్మి, లక్ష్మీనారాయణపురం
పనులు కల్పించడంలేదు
గ్రామంలో ఉపాధి పనులను కల్పించడంలేదు. గతంలో చేసిన వాటికి డబ్బులివ్వలేదు. ఆరు వారాలకు సంబంధించిన వేతనాలు రావాల్సి ఉంది.
– శ్రీదేవి, లక్ష్మీనారాయణపురం
బకాయిలు చెల్లించాలి
పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. నెలల తరబడి వీటిని మంజూరు చేయకపోతే ఎలా బతకాలి. వీటిని అందజేసేలా చొరవ చూపాలి.
– చిన్నయ్య, లక్ష్మీనారాయణపురం
త్వరలో అందజేసేలా చర్యలు
ఉపాధి పనులకు హాజరయ్యే శ్రామికులకు వేతన బకాయిలను త్వరలో చెల్లించేలా చర్యలు చేపడతాం. వీరి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమవుతుంది. పనిదినాలు పెంచేలా రాష్ట్ర అధికారులు చర్యలు చేపడుతున్నారు. – గంగభవానీ, డ్వామా పీడీ
●

ఎనిమిది వారాలు పనిచేశాం

ఎనిమిది వారాలు పనిచేశాం