
పెంచలకోనలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
రాపూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయంలో నిత్య పూజల సమయంలో తెలిసీ తెలియక సంభవించే సకలదోష నివారణ కోసం పాంచరాత్రాగమానుసారం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి తెలిపారు. మూడురోజులు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యేకంగా పట్టుతో తయారు చేసిన పవిత్రమాలలకు వివిధ పూజలు నిర్వహించి స్వామి మీద ఉంచి చతుస్థానార్చన (అభిషేకం) చేస్తామన్నారు. స్వామి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను శేషవాహనంపై కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం శ్రీవారి నందనవనం నుంచి పుట్ట మట్టి తీసుకొచ్చి అందులో నవధాన్యాలు కలిపి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మత్సంగ్రహణం, స్వామికి స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం శ్రీవారికి పవిత్రాలు ప్రతిష్ట, ఆధివాసహోమం, పవిత్ర సమర్పణ, శాత్తుమొఱై, నిర్వహించారు. దీంతో పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమైందని అర్చకులు
తెలిపారు.

పెంచలకోనలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ