పన్ను చెల్లించని వాహనాలపై కేసులు | - | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లించని వాహనాలపై కేసులు

Sep 4 2025 6:33 AM | Updated on Sep 4 2025 6:33 AM

పన్ను

పన్ను చెల్లించని వాహనాలపై కేసులు

నెల్లూరు (టౌన్‌): నెలల తరబడి జిల్లాలో తిరుగుతూ ఎలాంటి లైఫ్‌ట్యాక్స్‌లు చెల్లించని కార్లపై రవాణా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పన్నులు చెల్లించని ఇతర రాష్ట్రాల వాహనాలపై గత నెల 28న ‘సాక్షి’లో ‘అడిగేదెవరు.. ఆపేదెవరు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రవాణాశాఖాధికారులు స్పందించారు. ఎంవీఐ బాలమురళి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా జీవిత పన్ను చెల్లించని ఇతర రాష్ట్రాలకు చెందిన 15కు పైగా కార్లు, ఇతర వాహనాలపై కేసుల నమోదు చేసి సీజ్‌ చేశారు. ఆర్టీఓ మదాని మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు జిల్లాలో తిరగాలంటే ఆ వాహనానికి సంబంధించి జీవిత పన్ను చెల్లించాలన్నారు.

జెడ్పీలో కారుణ్య

నియామకాలు

నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్‌ యాజమాన్యంలో పనిచేస్తూ మరణించిన ఇద్దరు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఆఫీస్‌ సబార్డినేట్లుగా ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం జెడ్పీ చైర్‌పర్స్‌న్‌ ఆనం అరుణమ్మ, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు అందించారు.

15వ ఆర్థిక సంఘం

నిధుల విడుదల

నెల్లూరు (పొగతోట): జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారని డీపీఓ శ్రీధర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 722 పంచాయతీల్లో నాలుగు పంచాయతీకు జరగలేదు. 718 పంచాయతీలకు రూ. 40,82,23,462 నిధులు విడుదల చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత నిధులు విడుదల కాని 65 గ్రామ పంచాయతీలకు రూ.1,90,78,952 నిధులు విడుదల చేశారు. మొత్తం 718 గ్రామ పంచాయతీలకు రూ.42,73,02,414 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశారు.

ముగ్గురికి రాష్ట్రస్థాయి ఉత్తమ

ఉపాధ్యాయ అవార్డులు

నెల్లూరు (టౌన్‌): జిల్లా నుంచి అత్యుత్తమ సేవలు అందించిన ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. బుచ్చి మండలం పెనుబల్లి ఎంపీపీఎస్‌లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ సీహెచ్‌ చెన్నయ్య, ఇందుకూరుపేటలోని ఎంకేఆర్‌ ప్రభుత్వ హైస్కూల్‌ ప్లస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్‌) కె. డొమనిక్‌రెడ్డి, ఇందుకూరుపేట మండలం నరసాపురంలోని ఎంవీఆర్‌ఆర్‌ జెడ్పీహైస్కూల్‌ అసిస్టెంట్‌ (పీడీ) ఎస్‌కే ముజీర్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమరావతిలో సీఎం చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు.

9న హెచ్‌ఐవీపై

అవగాహన మారథాన్‌

నెల్లూరు (అర్బన్‌): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 9న 5 కి.మీ. పరుగు (మారథాన్‌) నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌ఓ సుజాత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటలకు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ, ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం, స్పోర్ట్స్‌ అథారిటీ, రెడ్‌రిబ్బన్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు 17– 25 ఏళ్లలోపు విద్యార్థులు, మగ, ఆడ, ట్రాన్స్‌జెండర్‌ విభాగాల్లో విడివిడిగా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రంలోపు 86394 32458 నంబర్‌కు కాల్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఈ నెల 9న ఏసీ స్టేడియం వద్దకు తమ ఐడీ కార్డుతో హాజరు కావాలని కోరారు. విజేతలకు అన్ని విభాగాల్లో మొదటి బహుమతిగా రూ.10 వేలు, రెండో బహుమతిగా రూ.7 వేలు నగదు బహుమతి ఇస్తామన్నారు. విజేతల ఎంపిక జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ నిర్ణయిస్తార న్నారు. ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయి మారథాన్‌ పోటీకి అర్హులవుతారన్నారు.

పన్ను చెల్లించని  వాహనాలపై కేసులు 
1
1/2

పన్ను చెల్లించని వాహనాలపై కేసులు

పన్ను చెల్లించని  వాహనాలపై కేసులు 
2
2/2

పన్ను చెల్లించని వాహనాలపై కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement