238 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

238 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

Sep 4 2025 6:17 AM | Updated on Sep 4 2025 6:17 AM

238 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

238 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

సోమశిల: అనంతసాగరం మండలంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. గత నెల మొదటి వారంలోనే అక్రమంగా తరలిస్తూ కోవూరు సమీపంలో 950 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నెల ప్రారంభమై రెండు రోజులు గడవక ముందే బుధవారం ఇనుగలూరు గ్రామానికి సమీపంలోని ఓ తోటలో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని నిల్వ ఉంచారని అధికారులు, మీడియాకు గ్రామస్తులు సమాచారమివ్వడంతో రెవెన్యూ, సివిల్‌ సప్లయ్స్‌, పోలీస్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. తోటలోని ఓ రేకులషెడ్‌, రెండు ట్రాక్టర్ల ట్రంకులో 238 బస్తాల బియ్యం ఉండటాన్ని అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సివిల్‌ సపయ్స్‌ డీటీ అజీజ్‌ మాట్లాడారు. బియ్యం అక్రమ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో దాడులు చేసి సరుకును సీజ్‌ చేశామన్నారు. ఈ బియ్యాన్ని ఆత్మకూరు ఎమ్మెల్‌ఎస్‌ పాయింట్‌కు తరలిస్తామని వెల్లడించారు. తహసీల్దార్‌ జయవర్ధన్‌, ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement