
భుజం నొప్పికి ప్రత్యేక స్క్రీనింగ్
నెల్లూరు(అర్బన్): భుజం నొప్పితో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారి కోసం నగరంలోని అపోలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిలో ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షల ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చామని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ శ్రీరామ్ సతీష్ పేర్కొన్నారు. రోబోటిక్ ఆర్థోప్లాస్టీ సర్జన్ వివేకానందరెడ్డి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ డాక్టర్ శశిధర్‌రెడ్డి, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ విక్రమ్‌రెడ్డితో కలిసి ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీరామ్‌సతీష్ మాట్లాడారు. రూ.999కే డాక్టర్ల కన్సల్టేషన్‌తో పాటు ఆర్బీఎస్, సీబీసీ, యూరిక్ యాసిడ్, సీరమ్ క్రియాటినిన్, ఎక్స్‌రే – షోల్డర్, సీస్పైన్ పరీక్షలను నిర్వహించనున్నామని, ఈ ప్రత్యేక ప్యాకేజీ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. తొలుత బ్రోచర్లను ఆవిష్కరించారు. యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.