
ప్రతి మదిలో రాజన్న జ్ఞాపకాలు
● ఆనం అరుణమ్మ,
విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు సిటీ: ‘వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేదలకు చేయూ తనందించారు. అందరి మదిలో ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి’ అని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. రూరల్లోని కరెంటాఫీస్ సెంటర్‌లో మహానేత రాజన్న విగ్రహానికి మంగళవారం వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి అన్ని వర్గాలకు ఆశాజ్యోతి అన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య చికిత్స చేయించినట్లు చెప్పారు. ఆయన ప్రతి ఒక్కరి మనసులో శాశ్వతంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రూరల్ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.