
మైపాడు రిసార్ట్స్‌కు కరెంట్ కట్
● అస్తవ్యస్తంగా నిర్వహణ
● అవస్థలు ఎదుర్కొంటున్న పర్యాటకులు
ఇందుకూరుపేట: జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మైపాడు బీచ్‌లో రిసార్ట్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందనే ఆరోపణలున్నాయి. రూ.2.30 లక్షల విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో సంబంధిత అఽధికారులు గత నెల 30వ తేదీ రాత్రి నుంచి సరఫరాను నిలిపివేశారు. బీచ్‌కు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి అనేకమంది సందర్శకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. 2013లో తీరంలో రిసార్ట్స్ ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పింది. అయితే ఇక్కడ నగదు వసూలు చేయడం తప్ప పర్యాటకులకు కనీస వసతులు కల్పించడం లేదనే ఆరోపణలున్నాయి. గదుల్లో ఏసీలు, టీవీలు సక్రమంగా పనిచేయకపోవడం, పారిఽశుధ్యం లోపించడం తదితర సమస్యలున్నాయని పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. సూదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి విడిది చేసేందుకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో సర్దుకుపోవాల్సి వస్తోంది. రెస్టారెంట్ నిర్వహణ ఘోరంగా ఉన్నట్లు ప్రచారం ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు రిసార్ట్స్ అడ్డాగా మారాయి. జంటలకు గదులను ఇచ్చేస్తున్నారు. అలాగే జూదరులు, మందుబాబులకు ఇది చిరునామాగా మారింది.
బిల్లు చెల్లిస్తేనే..
బిల్లును సకాలంలో చెల్లించపోవడంతో రిసార్ట్స్‌కు విద్యుత్ సరఫరా కట్ చేశాం. బిల్లు చెల్లిస్తే సరఫరాను పునరుద్ధరిస్తాం.
– నరసింహులు, విద్యుత్ శాఖ ఏఈ, నరసాపురం