
దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు
నెల్లూరు (టౌన్): చెవి, కంటి, మానసిక, శారీరక వైకల్యం ఉన్న దివ్యాంగ విద్యార్థులకు త్వరలో ఉపకరణాలను అందజేయనున్నట్లు డీఈఓ బాలాజీరావు తెలిపారు. మంగళవారం రంగనాయకులపేటలోని పీఎంఆర్ మున్సిపల్ స్కూల్‌లో నిర్వహించిన మెడికల్ క్యాంపులో 135 మంది దివ్యాంగ విద్యార్థులకు వివిధ విభాగాల వైద్యు లు పరీక్షలు నిర్వహించారు. సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఎంఈఓ తిరుపాల్, సమగ్రశిక్ష సీఎంఓ పెంచలయ్య, హెచ్‌ఎం హైమావతి తదితరులు పాల్గొన్నారు.
కంప్యూటర్, వృత్తి నైపుణ్య
కోర్సుల్లో ఉచిత శిక్షణ
నెల్లూరు (టౌన్): దీన్‌దయాళ్ ఉపాధ్యాయ– గ్రామీణ కౌసల్య యోజన పథకంలో భాగంగా సీడాప్, త్రెడ్జ్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ కంప్యూటర్, వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ యజమాని కె.సునీల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ సమయంలో వసతి, భోజనం, యూనిఫాం అందజేస్తామని చెప్పారు. శిక్షణ అనంతరం ఇండస్ట్రీయల్ సర్టిఫికెట్‌తోపాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు విద్యార్హత స ర్టిఫికెట్, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జెరాక్స్‌లను త్రెడ్జ్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్, కేఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కాలేజి, కొత్తూరురోడ్డు, కోవూరు అడ్రసులో అందజేయాలన్నారు. ఇతర వివరాలకు 98661 11223 నంబరులో సంప్రదించాలన్నారు.
వెంకటాచలం సర్పంచ్‌కు
షోకాజు నోటీసు
వెంకటాచలం: వెంకటాచలం సర్పంచ్ మందల రాజేశ్వరి చెక్ పవర్ ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని డీపీఓ శ్రీధర్‌రెడ్డి మంగళవారం షోకాజు నోటీసు ఇచ్చారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయ ని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో డీఎల్పీఓ తో విచారణ చేపట్టగా, నిధులు దుర్వినియోగానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే మళ్లీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి కావలి డీఎల్పీఓతో ఇటీవల విచారణ జరిపారు. ఈ క్రమంలో సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయకూడదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాల ని సర్పంచ్ రాజేశ్వరి షోకాజు నోటీసు ఇచ్చారు. రాజేశ్వరి మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే బీసీ మహిళా సర్పంచ్‌నైన తన చెక్‌పవర్ రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
రైళ్ల పరుగుకు అంతరాయం
బిట్రగుంట: కాకినాడ పోర్ట్ నుంచి చైన్నె వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బ్రేక్ బైండిగ్ కారణంగా కొదిసేపు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. రైలు కావలిస్టేషన్ దాటిన తర్వాత ఎస్వీపాళెం స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ బైండింగ్ సమస్య తలెత్తింది. దీంతో రైలును పరిమిత వేగంతో బిట్రగుంట స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే సిద్ధంగా ఉన్న సిబ్బంది హుటాహుటిన మరమ్మతులు పూర్తి చేసి రైలు పరుగుకు పచ్చజెండా ఊపారు.