
పాఠశాల వ్యాన్ ఢీకొట్టడంతో..
● భర్త మృతి, భార్యకు గాయాలు
ఆత్మకూరు: పాఠశాల వ్యాన్ మోటార్‌బైక్‌ను ఢీకొట్టడంతో షేక్ ఖాసీం (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండలంలోని కరటంపాడు గ్రామం వద్ద నెల్లూరు – ముంబై రహదారిపై సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్సై ఎస్‌కే జిలానీ కథనం మేరకు.. ఉదయగిరి మండలానికి చెందిన షేక్ ఖాసీం తన భార్య హజరత్‌బీతో కలిసి ఉదయగిరి నుంచి నెల్లూరుకు బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ కరటంపాడు గ్రామంలోకి మలుపు తిరుగుతూ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ఖాసీం మృతిచెందాడు. హజరత్‌బీకి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.