
వినాయకా.. మన్నించు
నెల్లూరు(బృందావనం): వినాయకచవితి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే నిమజ్జన విషయంలో అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్‌ను తగినంత నీటిని నింపలేకపోయారు. దీనికితోడు చాలాచోట్ల నుంచి ఊరేగింపుగా వచ్చేసరికి సోమవారం తెల్లవారుజామున కావడంతో విగ్రహాలను ఇష్టానుసారంగా వదిలేశారు. చాలావరకూ పూర్తిగా మునగలేదు. సగం మునిగిన ఏకదంతుని రూపాలు చూసి భక్తజనం మండిపడుతోంది. ఈ ఏడాది నాయకులను మన్నించు.. రానున్న ఏడాదైనా సరిదిద్దుకునే అవకాశమివ్వమంటూ వేడుకుంటున్నారు.

వినాయకా.. మన్నించు

వినాయకా.. మన్నించు