
వరి కోసేందుకు వెళ్లి..
ఇందుకూరుపేట: విద్యుత్ వైరు తగిలి రైతు మృతిచెందిన ఘటన మండలంలోని కొత్తూరు మజారా చట్టివారికండ్రిగలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నెట్రంబాక వెంకటేశ్వర్లు (55) వరి పంటను కోసేందుకు సిద్ధమై పొలంలో తిరుగుతున్నాడు. ఈ సమయంలో విద్యుత్ స్తంభానికి ఉన్న లైన్ తెగి పడిఉంది. ఇది వెంకటేశ్వర్లు గమనించలేదు. అతను విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిడికి భార్య, పిల్లలున్నారు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమని స్థానిక రైతులు ఆరోపించారు. ఏబీ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

వరి కోసేందుకు వెళ్లి..