
30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలి
నెల్లూరు (టౌన్): కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ కమిషన్‌ను నియమించి 30 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక అన్నమయ్య సర్కిల్‌లోని యూటీఎఫ్ భవనంలో ఆదివారం నిర్వహించిన మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. పాఠశాలల బలోపేతానికి యూటీఎఫ్ కార్యకర్తలు శ్రమించాలని సూచించారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవకోటేశ్వరరావు మాట్లాడారు. ప్రచార యాత్రను ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించనున్నామని చెప్పారు. పీఆర్సీ, ఐఆర్, డీఏల సాధనకు గానూ ఈ నెల 17 నుంచి 20 వరకు మండల కేంద్రాల్లో.. అక్టోబర్ 7న జిల్లా కేంద్రంలో.. 21న విజయవాడలో ధర్నా ను నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నామని వెల్లడించారు. సమావేశంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, జన విజ్ఞాన వేదిక నేతలు కృష్ణారెడ్డి, ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.