
నీ వ్యాఖ్యలను అసహ్యించుకుంటున్న ప్రజలు
● కావలి ఎమ్మెల్యేపై ధ్వజమెత్తిన పేర్నేటి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఈవీఎంలు కలిసొచ్చి గెలిచిన నీవు.. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడే మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారంటూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పేర్నేటి కోటేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. కావలిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వెలుగులోకి తీచ్చేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అక్రమ కేసులను బనాయించడం దారుణమని చెప్పారు. ఆయన్ను పరామర్శించేందుకు సంకల్పించిన కాకాణి, పర్వతరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కావ్య వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై కృష్ణారెడ్డికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటన్నారు. మీడియా సమావేశాల్లో ఎలా మాట్లాడాలో తెలియని ఆయన తన నీచపు వ్యక్తిత్వాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. చంద్రశేఖర్‌రెడ్డికి స్కూళ్లు లేవని, ఉన్నవి కళాశాలలు మాత్రమేననే విషయాన్ని అజ్ఞానైన ఆయన గుర్తుంచుకోవాలని హితవు పలికారు. క్వారీల్లో జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్‌లతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. కావలిలో జరిగిన మనీస్కామ్‌లో కోట్లాది రూపాయలు చేతు లు మారాయని తాము చెప్తుంటే, ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికై నా చవకబారు మాటలకు స్వస్తి పలికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు.