
పక్షవాత రోగిపై పచ్చపాతం
పక్షవాతంతో దయనీయ దుస్థితిని ఎదుర్కొంటున్న అభాగ్యుడిపై దయ లేకుండా పింఛన్ సొమ్ములో కోత విధించేందుకు కూటమి సర్కార్ సిద్ధపడింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నం దళితవాడకు చెందిన మర్లపాటి చార్ముడయ్య కూలీనాలీ చేసుకొని జీవనం సాగించేవారు. పక్షవాతంతో చార్ముడయ్య పదేళ్ల క్రితం మంచాన పడ్డారు. భార్య సాయం లేనిదే కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితిలో బతుకీడుస్తోంది. ఏ ఉపాధీ లేని ఆ కుటుంబానికి చార్ముడయ్యకు ఇచ్చే పింఛనే ఆధారం. మందులకే నెలకు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. గత నెల వరకు పింఛన్ రూపంలో రూ.15 వేలను ఇస్తుండగా, తాజాగా ఈ నెల నుంచి రూ.ఆరు వేలే వస్తాయంటూ ఈయనకు నోటీసులను అందజేశారు. దీంతో తామెలా బతకాలంటూ ఈ దంపతులు లబోదిబోమంటున్నారు.