
పోలీసు అదుపులో ఐదుగురు రౌడీషీటర్లు
నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు సిటీ: నేను రౌడీషీటర్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, వి ద్యార్థి నేతగా ఉన్న సమయంలోనే రౌడీలను ఉరికించి ఉరికించి తరిమికొట్టిన చరిత్ర నాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. శనివారం మాగుంట లేవుట్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుందా రాజకీయాలకు చిరునామా అయిన నెల్లూరులో రౌడీషీటర్లు నన్ను చంపేయాలని అందరూ మాట్లాడుకున్నార ని తెలిపారు. నన్ను చంపేందుకు ఎవరు వారికి డబ్బు ఇస్తామన్నారని, ఒక పౌరుడిగా నేను అడుగుతున్నానన్నారు. ఎస్పీ మూడు రోజుల ముందు నుంచే మా నోటీసులో ఉందని చెప్పారని, కనీసం నాకు సమాచారం ఇవ్వలేదని, జాగ్రత్త కూడా చెప్పలేదన్నారు. ఈ విషయం పోలీసుల విచారణలో తేల్చాలని డిమాండ్ చేశారు. నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నాపై కుట్ర చేశారంటూ వైఎస్సార్‌సీపీ ప్రచారం చేసిందన్నారు. ఇటువంటి సంప్రదాయం మా కుటుంబంలో లేదన్నారు.