
పోలీసుల సమక్షంలో రికార్డింగ్ డ్యాన్స్
● టీడీపీ నేత నిర్వాకం
● జనరేటర్‌కు చున్నీ తగిలి..
కిందపడటంతో డ్యాన్సర్‌కు గాయాలు
ఉలవపాడు: వినాయక చవితి నేపథ్యంలో రికార్డింగ్ డ్యాన్స్‌ను ఉలవపాడులో పోలీసుల సమక్షంలో టీడీపీ నేత నిర్వహించారు. అధికారం అండతో స్థానిక గంగమిట్టలోని వినాయకుడి గుడి ధర్మకర్తగా ఉన్న టీడీపీ నేత.. చిలకలూరిపేటకు చెందిన ఎనిమిది మంది యువతులను తీసుకొచ్చి ట్రాక్టర్‌పై గ్రామమంతా తిరుగుతూ డ్యాన్స్ నిర్వహించేలా ఏర్పాటు చేశారు. దీనిపై కాలనీకి చెందిన కొందరు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా, పోలీస్ శాఖ ఏ మాత్రం పట్టించుకోలేదు. పోలీస్ వాహనంలో ఖాకీలు వచ్చి దగ్గరుండి డ్యాన్స్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో కోనేరు వద్దకు ట్రాక్టర్ వచ్చేసరికి ఓ డ్యాన్సర్ చున్నీ జనరేటర్‌కు తగిలింది. దీంతో తీవ్రగాయాలతో స్పృహ తప్పి పడిపోయారు. స్థానికంగా ఉన్న సరయూ వైద్యశాలకు వెంటనే తరలించారు. రికార్డింగ్ డ్యాన్స్‌లపై నిషేధం ఉన్నా.. డీజేకు అనుమతి లేకపోయినా సదరు టీడీపీ నేత తాను డ్యాన్స్ పెడతానని ముందే ప్రకటించి ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిందని ఎస్సై అంకమ్మకు స్థానికులు ఫోన్ చేయడంతో దీన్ని నిలిపేయించారు.