
స్వర్ణాల చెరువు.. కోర్కెల అర్థనకు వేదికై ంది. వరాల రొట్
భక్త జనసంద్రమైన స్వర్ణాల ఘాట్
నెల్లూరు (బారకాసు): విద్య, ఉద్యోగం, విదేశీయానం, వ్యాపారం, ధనం, సౌభాగ్యం, వివాహం, ఆరోగ్యం, ప్రమోషన్, స్వగృహం.. ప్రతి ఒక్కరి కల. జీవితాశయం. బారాషహీదులు ఆశీస్సులతో స్వర్ణాల సాక్షిగా తీరుతాయనేది ప్రగాఢ విశ్వాసం. భక్తి ప్రపత్తులతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల మధ్య రొట్టెల పండగ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు కోర్కెలు తీరిన భక్తులు వదిలే రొట్టెల కోసం కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. స్వర్ణాల చెరువు వరాల రొట్టెలు మార్చుకునే భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు ఆచరించి తమ కోర్కెల రొట్టెల మార్పిడి చేసుకున్నారు. మత బోధకులైన యుద్ధ వీరుల త్యాగనిరతిని స్మరిస్తూ సమాధులను దర్శించుకున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న రొట్టెల పండగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కే కార్తీక్, కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చినా ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు స్వచ్ఛందంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
ప్రతి కోర్కె రొట్టెకు ప్రత్యేక ఘాట్
స్వర్ణాల చెరువులో సంప్రదాయబద్ధంగా స్నానమాచరించి రొట్టెలు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ. ఇందుకోసం ఏ కోర్కె రొట్టె ఎక్కడ దొరుకుంతుందో వెతుకులాటతో భక్తులు ఇబ్బంది పడకూడదని అధికారులు ప్రతి కోర్కె రొట్టెకు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. భక్తులు ఏ కోర్కెతో వచ్చారో ఆ ఘాట్‌లోకి వెళ్లి తమకు కావాల్సిన రొట్టెను అందుకుంటున్నారు. గతంలో తమ కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలను వదులుతున్నారు. ఆరోగ్యం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, గృహ, సౌభాగ్యం, వివాహం, విదేశీయానం రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు.
స్వర్ణాల చెరువు వద్ద పక్కాగా ఏర్పాట్లు
బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు పట్టుకొనే భక్తుల కోసం నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువు లోతులోకి వెళ్లకుండా ఉండేందుకు చెరువులో కంచె, చెరువు ఘాట్ వద్ద నీటిని శుభ్రం చేసే యంత్రాలు ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో షహదత్ సందల్ మాలి
నెల్లూరు (బృందావనం): రొట్టెల పండగ తొలి రోజు ఆదివారం సంప్రదాయంగా మత పెద్ద షబ్బీర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు అమరులైన 12 మంది యోధులను స్మరిస్తూ దర్గా ప్రాంగణంలో బారాషహీద్‌ల సమాధుల చెంత షహదత్ (ప్రత్యేక పూజలు) నిర్వహించారు. 2 గంటల వరకు గులాములు, పన్నీరుతో పరిశుభ్రం చేశారు. సంప్రదాయంగా గంధం లేపనం చేసిన అనంతరం గలేఫాలు, చద్దర్లు కప్పి ‘సందల్ మాలి’ భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ ఘట్టాన్ని భక్తజనం కనులారా భక్తి శ్రద్ధలతో వీక్షించి పరవశించిపోయారు.
గంధ మహోత్సవం నేడు
బారాషహీద్ దర్గా రొట్టెల పండగలో అత్యంత ప్రాధాన్యత కలిగిన గంధ మహోత్సవం 2వ రోజు సోమవారం రాత్రి నిర్వహించనున్నారు. పవిత్రమైన గంధాన్ని 12 పవిత్ర కలశాలలో కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి సంప్రదాయంగా గంధాన్ని తీసుకు వచ్చి బారాషహీద్‌లకు లేపనం చేసి. అనంతరం భక్తులకు ఆ గంధాన్ని, ప్రసాదాన్ని పంచి పెట్టనున్నారు. ఎంతో విశేషంగా అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు.
వైభవంగా ప్రారంభమైన రొట్టెల పండగ
తెల్లవారుజాము నుంచే
పోటెత్తిన భక్తులు
బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు కిటకిట
కోర్కెల రొట్టెలు
ఇచ్చిపుచ్చుకున్న భక్తులు

స్వర్ణాల చెరువు.. కోర్కెల అర్థనకు వేదికై ంది. వరాల రొట్

స్వర్ణాల చెరువు.. కోర్కెల అర్థనకు వేదికై ంది. వరాల రొట్

స్వర్ణాల చెరువు.. కోర్కెల అర్థనకు వేదికై ంది. వరాల రొట్