
కాకాణికి రెండు రోజుల పోలీస్ కస్టడీ
నెల్లూరు (లీగల్): ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాళెంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిఫై ఇందుకూరుపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు అక్రమంగా నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం శనివారం నుంచి రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు స్పెషల్ ఎకై ్సజ్ కోర్టు (ఇన్‌చార్జి) న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకాణిని 12వ తేదీ ఉదయం 8 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఎకై ్సజ్ అధికారులు కస్టడీకి తీసుకోవాలని, సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని, 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు అయనకు వైద్య పరీక్షలు చేయించి మెడికల్ సర్టిఫికెట్‌తో కోర్టులో హాజరు పరచాలన్నారు. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని ఉత్తర్వురులో పేర్కొన్నారు. న్యాయవాది సమక్షంలో గోవర్ధన్‌రెడ్డిని విచారణ జరపాలన్నారు. కాకాణిని కస్టడీ ఇవ్వాలని ఇందుకూరుపేట ఎకై ్సజ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై పోలీసుల తరఫున ఏపీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ కేసులో గోవర్ధన్‌రెడ్డి పాత్ర ఉందని విచారించడానికి ఏడు రోజులు కస్టడీ అవసరం ఉందన్నారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమమహేశ్వరరెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని కేవలం రాజకీయ కక్షతో కేసులో ఇరికించారని పోలీస్ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గోవర్ధన్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ఉత్తర్వులిచ్చారు.
వరదాపురంమైనింగ్ కేసులో నిరాకరణ
నెల్లూరు (లీగల్): పొదలకూరు మండలం వరదాపురంలోని భూముల్లో అక్రమ మైనింగ్ జరిపారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పొదలకూరు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. గోవర్ధన్‌రెడ్డిని పోలీస్ కస్టడీ కోరుతూ సబ్ డివిజన్ పోలీస్ అధికారి, నెల్లూరురూరల్ పోలీస్‌లు నెల్లూరు 5వ అదనపు జిల్లా (స్పెషల్ ఎస్సీ, ఎస్టీ) కోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. పోలీ సుల తరఫున ప్రత్యేక పీపీ విజయమ్మ వాదనలు వినిపించారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి, తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్. సరస్వతి పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను తిరస్కరిస్తూ విచారణకు నిరాకరించారు.