
సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వెండి బిస్కెట్ల సమర్పణ
మోపిదేవి: కృష్ణా జిల్లా మోపిదేవిలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి 2.3 కిలోల వెండి బిస్కెట్లను కందుకూరుకు చెందిన తాళం నితిన్‌కుమార్ కుటుంబసభ్యులు శనివారం సమర్పించారు. స్వామివార్లను దర్శించుకున్న అనంతరం వీటిని ఈఓ దాసరి శ్రీరామవరప్రసాదరావుకు అందజేశారు. అనంతరం దాత కుటుంబసభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, నౌడూరి సుబ్రహ్మణ్యశర్మ, వెంకటేశ్వరరావు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
పాముకాటుకు
మహిళ మృతి
సీతారామపురం: పాముకాటుకు మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని అయ్యవారిపల్లి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. వేప చెట్ల వద్ద వేప విత్తనాలను ఏరుకునేందుకు గానూ సింగారెడ్డిపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన అంకి పుష్ప (39) గ్రామానికి చెందిన మరో మహిళతో కలిసి అయ్యవారిపల్లి – దేవిశెట్టిపల్లి మార్గంలోని పొలాల గట్ల వద్దకెళ్లారు. ఈ క్రమంలో విషసర్పం కాటేయడంతో కేకలేస్తూ సహచర మహిళ వద్దకెళ్లి విషయాన్ని చెప్పి అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సాయంలో పుష్పను అయ్యవారిపల్లికి తీసుకొచ్చి 108లో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. కాగా పుష్ప భర్త నెలన్నర క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలికి సంతానం లేరు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
మనుబోలు: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొండూరుసత్రం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. కొండూరుసత్రం సమీపంలోని పవర్ గ్రిడ్ ఎదురుగా ఓ వ్యక్తి గాయాలతో మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన వాహనచోదకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఎస్సై శివరాకేష్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శవ పంచనామా నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు యాచకుడై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వెండి బిస్కెట్ల సమర్పణ

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వెండి బిస్కెట్ల సమర్పణ