
జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాణి పూజిత జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసిన వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. సంజీవయ్య మాట్లాడుతూ దేశంలో హరిత విప్లవానికి, కార్మిక విప్లవానికి ఆద్యులు జగ్జీవన్‌రామ్ అని, అణగారిన వర్గాలకు రాజ్యాంగఫలాలు అందించేందుకు జీవితకాలం శ్రమించారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన ఎల్లకాలం సాగదని గుర్తుంచుకోవాలన్నారు. పూజిత మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం వర్థంతి సందర్భంగా ఆయన చేసిన గొప్ప విషయాలను దేశమంతా గుర్తు చేసుకుంటుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. జగ్జీవన్‌రామ్ ఆశయాలు రాష్ట్రంలో అమలు కావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ సత్తార్, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శులు స్వర్ణ వెంకయ్య, రవీంద్ర, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాకుటూరి లక్ష్మీసునంద, అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు పాల లావణ్య, మహిళా రాష్ట్ర కార్యదర్శి వెంకటజ్యోతి, మండల కన్వీనర్ మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.