
ప్రశాంతమ్మా.. ఇదేనా అవినీతి రహిత పాలన
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అవినీతి రహిత పాలన అంటూ నిత్యం నీతులు వల్లిస్తోంది. కానీ తన నియోజకవర్గంలోనే అన్ని రంగాల్లో అవినీతే జరుగుతోంది. పోతిరెడ్డిపాళెంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. జొన్నవాడ, మినగల్లు నుంచి పోతిరెడ్డిపాళెం, పల్లిపాళెం వరకు నిత్యం భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరగుతూనే ఉంది. కానీ ఎక్కడా అధికారులు అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేదు. గతంలో మినగల్లులో 12 వేల మెట్రిక్ టన్నుల ఇసుక మాయం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఆ మాయమైన ఇసుక నగదు రికవరీ ఏమైందో ఇప్పటికీ చిదంబర రహస్యంగానే మిగిలిపోయింది.