
ఇసుక దోపిడీ నిర్విఘ్నం
పేరుకే డ్రెడ్జింగ్.. యంత్రాలతో తవ్వకాలు
అక్రమ తవ్వకాల ద్వారా డంపింగ్ చేసిన ఇసుక
● డ్రెడ్జింగ్ పేరుతోనే నెట్టుకొస్తున్న
అధికార యంత్రాంగం
● అధికారికంగా రెండు చోట్ల..
అనధికారికంగా ముప్పై రీచ్‌లు
● యంత్రాలతో తోడేస్తున్న వైనం
● పెన్నా పొర్లుకట్టలు ధ్వంసం
● పట్టించుకోని మైనింగ్, ఇరిగేషన్
అధికారులు
ఏడాది కాలంగా పర్యావరణ అనుమతి ఊసేలేదు
కోరలు చాచిన ఇసుక మాఫియా పెన్నానదిని కబళించేస్తోంది. ఏడాదిగా ఇసుక దోపిడీ నిర్విఘ్నంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’ నుంచి పర్యావరణ అనుమతులు తీసుకోవాలనే ఆలోచనే చేయకుండా తమ పార్టీ నేతలకు దోచిపెడుతోంది. ఎన్‌జీటీకి ప్రతిపాదనలు పంపితే.. ఎక్కడికక్కడ ఇసుక అక్రమ తవ్వకాలకు బ్రేక్ పడుతుందనే దుగ్ధతోనే అడ్డదారిలో అక్రమాలకు పాల్పడుతోంది. డ్రెడ్జింగ్ పేరుతో కాలయాపన చేస్తోంది. అధికారికంగా రెండు చోట్ల డ్రెడ్జింగ్‌కు అనుమతులిస్తే.. అనధికారికంగా ముప్పై రీచ్‌ల నుంచి ఇసుకను తోడేస్తున్నారు.

ఇసుక దోపిడీ నిర్విఘ్నం