
టెన్నిస్‌బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అండర్ – 14 సౌత్‌జోన్ బాలబాలికల టెన్నిస్‌బాల్ క్రికెట్ పోటీలను శనివారం ప్రారంభించారు. పోటీలకు దక్షిణాదిలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. డీఎస్డీఓ యతిరాజ్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, డాక్టర్ పిట్టి మల్లికార్జున, టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు యుగంధర్, నిర్వాహక కార్యదర్శి అజయ్‌కుమార్, సభ్యులు మల్లిక, చరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
‘డీకేడబ్ల్యూ’లో
సర్టిఫికెట్ కోర్సు
నెల్లూరు (టౌన్): నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ నాన్ వాయిస్ సర్టిఫికెట్ కోర్సును రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ప్రారంభించనున్నామని ప్రిన్సిపల్ గిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు, పదో తరగతి చదివిన మహిళలు అర్హులని చెప్పారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్, ఉద్యోగాన్ని కల్పించనున్నారని, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 129
లేయర్ (లైవ్) : 100
బ్రాయిలర్ చికెన్ : 230
బ్రాయిలర్ స్కిన్‌లెస్ : 254
లేయర్ చికెన్ : 170

టెన్నిస్‌బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభం