
అలవి వలలతో వేట సాగిస్తే చర్యలు
సోమశిల: సోమశిల జలాశయంలో అలవి వలలతో వేట సాగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు మత్స్యవేటకారులను హెచ్చరించారు. జలాశయం వెనుక భాగంలో నిషేధిత అలవి వలలతో వేట సాగుతుందని స్థానిక మత్స్యకారులు ఫిర్యాదు చేయడంతో శనివారం జేడీ నాగేశ్వరరావు తనిఖీ చేశారు. అధికారులతో కలిసి జేడీ జలాశయం నుంచి పడవలో వెనుక భాగం వరకు వెళ్లి పరిశీలించారు. అలవి వలలతో వేట సాగించే ప్రదేశానికి వెళ్లగా అక్కడ వాటికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లేకపోవడంతో వెనుదిరిగి వచ్చారు. అనంతరం ఫిర్యాదు చేసిన మత్స్యకారులతో జేడీ మాట్లాడుతుండగా మత్స్యకారుల్లోని ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. జేడీ వెంట మండల మత్స్యశాఖ అధికారి చందన తదితరులు ఉన్నారు.
మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు
అధికారుల ముందే ఇరువర్గాల
మత్స్యకారుల వాగ్వాదం