మూడే 3 సిక్స్‌లు.. వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన జైశ్వాల్‌? | Sakshi
Sakshi News home page

IND vs ENG: మూడే 3 సిక్స్‌లు.. వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన జైశ్వాల్‌?

Published Mon, Mar 4 2024 1:42 PM

Yashasvi Jaiswal Needs 3 Sixes In 5th Test To Become Second Batsmen After Viv Richards In... - Sakshi

ధర్మశాల వేదికగా ఐదో టెస్టులో ఇంగ్లండ్‌-భారత జట్లు తలపడేందుకు సిద్దమవుతున్నాయి. మార్చి 7 నుంచి ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు సూపర్‌ ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అవి ఏంటో ఓ లూక్కేద్దం.

1- ధర్మశాల టెస్టులో యశస్వీ మరో పరుగు చేస్తే.. ఇంగ్లండ్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి(655) రికార్డును బ్రేక్‌ చేస్తాడు.

38- ఈ మ్యాచ్‌లో జైశ్వాల్‌ మరో 38 పరుగులు చేస్తే 21వ శతాబ్దంలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జైశ్వాల్‌ చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి(692)ని అధిగమిస్తాడు. జైశ్వాల్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌ సిరీస్‌లో 655 పరుగులు చేశాడు.

5- ధర్మశాల టెస్టులో జైశ్వాల్‌ మరో 3 సిక్స్‌లు బాదితే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ క్రమంలో కివీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ సౌథీ(25)ని అధిగమిస్తాడు. ప్రస్తుత సిరీస్‌లో జైశ్వాల్‌ ఇప్పటివరకు 22 సిక్స్‌లు కొట్టాడు. కాగా ఈ జాబితాలో విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్ రిచర్డ్స్(34 సిక్స్‌లు) అగ్ర స్ధానంలో కొనసాగుతున్నాడు.,

29- ఆఖరి టెస్టులో జైశ్వాల్‌ మరో 29 పరుగులు సాధిస్తే.. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ 2023-25లో 1000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు. డబ్ల్యూటీసీ ప్రస్తుత సైకిల్‌లో జైశ్వాల్‌ ఇప్పటివరకు 971 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2024: పాపం మార్క్రమ్‌.. ఏంటి కావ్య పాప ఇది? మరీ ఇంత అన్యాయమా?

 
Advertisement
 
Advertisement