ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌.. ర‌ష్యా ప్లేయర్‌ అరెస్టు | Yana Sizikova Detained Over Suspected Match Fixing At Last Year French Open | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌.. ర‌ష్యా ప్లేయర్‌ అరెస్టు

Jun 4 2021 6:01 PM | Updated on Jun 4 2021 6:01 PM

Yana Sizikova Detained Over Suspected Match Fixing At Last Year French Open - Sakshi

పారిస్: గ‌తేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ర‌ష్యా క్రీడాకారిణి యానా సిజికోవాను శుక్రవారం ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 2020 ఫ్రెంచ్ ఓపెన్‌ మహిళల డ‌బుల్స్ తొలి రౌండ్‌ పోటీల్లో(సెప్టెంబ‌ర్ 30) సిజికోవా.. తన అమెరికన్‌ పార్ట్‌నర్‌ మాడిస‌న్ బ్రెంగ్లీలో కలిసి ఉద్దేశపూర్వకంగా మ్యాచ్‌ ఓడిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో సిజాకోవా జోడీ.. రొమేనియా జంట ఆండ్రియా మీటు, పాట్రిసియా మారియా చేతిలో 6-7, 4-6 తేడాతో ఓటమిపాలైంది. రెండో సెట్ అయిదో పాయింట్ వ‌ద్ద సిజికోవా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

దీనిపై గతేడాది అక్టోబర్‌లో విచారణ ప్రారంభించిన పోలీసులు, తాజాగా ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా సిజికోవా తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. నిన్న (గురువారం) సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో రష్యా భామ ఎకాటరీనా అలెక్సాండ్రోవాతో తొలిసారి జతకట్టిన సిజికోవా.. 1-6, 1-6తో ఆస్ట్రేలియా జోడీ స్టార్మ్‌ సాండర్స్‌, అజ్లా టామ్లజనోవిక్‌ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం డ‌బుల్స్‌ ర్యాంకింగ్స్‌లో 101 స్థానంలో కొనసాగుతున్న సిజికోవా.. ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు పార్ట్‌నర్లను మార్చి వరుస పరాజయాలను మూటకట్టుకుంది.
చదవండి: ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement