IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్‌ రషీద్‌?

Who is Shaik Rasheed? All you need to know about CSks new signing  - Sakshi

ఆంధ్ర యువ ఆటగాడు షేక్‌ రషీద్‌ ఐపీఎల్‌ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శుక్రవారం (డిసెంబర్ 23) జరిగిన ఐపీఎల్‌-2023 మినీ వేలంలో రషీద్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌-2022లో అద్భుతంగా రాణించిన రషీద్‌.. సీఎస్‌కే టాలెంట్ స్కౌట్‌ల దృష్టిలో పడ్డాడు.

ఈ ఏడాది ఎపీఎల్‌లో రాయలసీమ కింగ్స్ తరఫున ఆడిన రషీద్‌ 159 పరుగులు సాధించాడు. అదే విధంగా 2022 అండర్‌-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న యువ భారత జట్టుకు రషీద్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం జరిగిన ఐపీఎల్‌-2022 మెగా వేలంలో రషీద్‌ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షిస్తాడని అంతా భావించారు.

కానీ కొన్ని కారణాల వల్ల రషీద్‌తో పాటు పలువురు అండర్‌-19 ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనలేకపోయారు. కానీ ఐపీఎల్‌-2023 మినీవేలంలో మాత్రం రషీద్‌ కల నెరవేరింది. ఏకంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ వంటి జట్టుతోనే తన ఐపీఎల్‌ కెరీర్‌ను మొదలపెట్టనున్నాడు.ఇక ఎంస్‌ ధోని వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూంను షేర్‌ చేసుకోబోతున్న రషీద్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ షేక్‌ రషీద్‌?
18 ఏళ్ల షేక్‌ రషీద్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఒక​ మధ్య తరగతి కుటంబంలో జన్మించాడు.
చిన్నతనం నుంచే రషీద్‌కు క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో తొమ్మిదేళ్లకే అండర్‌-14 క్రికెట్‌లో అతడు అరంగేట్రం చేశాడు.
2022 అండర్‌-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యునిగా  రషీద్ ఉన్నాడు.
ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 50 పరుగులున చేసిన రషీద్‌.. భారత్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
2022 అండర్‌-19 ప్రపంచకప్‌లో రషీద్‌ 201 పరుగులు సాధించాడు.
ఇక దేశీవాళీ క్రికెట్‌లో కూడా రషీద్‌ ఎం‍ట్రీ ఇచ్చాడు.
ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రషీద్‌ ఆంధ్ర తరపున అరంగేట్రం చేశాడు.
చదవండి: IPL Mini Auction: ఐపీఎల్‌ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top