IPL 2024: వరుస ఓటములు.. హార్దిక్‌ పోస్ట్‌ వైరల్‌! ఏకిపారేస్తున్న నెటిజన్లు

We Never Give Up: Hardik Message to Fans After Frosty Wankhede Reception - Sakshi

ఐపీఎల్‌ 2014.. ముంబై ఇండియన్స్‌ ఆడిన తొలి ఐదు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. ఆ తర్వాత తిరిగి పుంజుకుని టాప్‌-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌ చేరింది.. ఆ మరుసటి ఏడాది అంటే 2015లో.. మొదటి నాలుగు మ్యాచ్‌లోనూ పరాజయమే పలకరించింది.

కానీ ఆ తర్వాత అనూహ్య రీతిలో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆ ఏడాది ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి ఏకంగా చాంపియన్‌గా అవతరించింది.

అదే విధంగా.. 2018లోనూ ఇదే తరహాలో తొలి మూడు మ్యాచ్‌లలో ఓటమే ఎదురైంది. అయితే, తమకు ఇదేమీ కొత్త కాదన్నట్లు ఆఖరి వరకు పోరాడింది. ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకోలేకపోయినా ఐదో స్థానం సాధించగలిగింది.

ఇక తాజా ఎడిషన్‌ను కూడా ఓటమితోనే మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్‌. తొలుత గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాభవం చెందిన హార్దిక్‌ సేన.. అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.

ఈ నేపథ్యంలో విమర్శకుల వేళ్లన్నీ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యావైపే చూపిస్తున్నాయి. ముఖ్యంగా జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌ సేవలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం సహా ఇలాంటి మరిన్ని అనాలోచిత నిర్ణయాల ఫలితమే హ్యాట్రిక్‌ పరాజయాలకు కారణమని అభిమానులు సైతం మండిపడుతున్నారు.

ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘‘ఈ జట్టు గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మేము ఎప్పటికీ నిరాశ చెందము. పోరాడుతూనే ఉంటాం.. ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాం’’ అని పాండ్యా ఎక్స్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్ల ఫొటోను పంచుకున్నాడు. 

మిలియన్‌కు పైగా వ్యూస్‌ సంపాదించిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘అప్పుడు కెప్టెన్‌గా ఉన్నది రోహిత్‌ శర్మ.. అందుకే గతంలో ఇలా జరిగినా జట్టు తిరిగి కోలుకుని విజయాల బాట పట్టింది.

రోహిత్‌ ఎంఐని ఒక్కటిగా ఉంచాడు. కానీ నువ్వు.. సీనియర్లు అన్న గౌరవం లేకుండా.. కనీస మర్యాద పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నావు. కోచ్‌లతో కూడా సయోధ్య ఉన్నట్లు కనిపించడం లేదు.

ఇక జట్టును ఎలా ఒక్కటిగా ఉంచగలవు? విజయాలెలా సాధించగలవు?’’ అని ఏకిపారేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్‌ తదుపరి సొంత మైదానం వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇరుజట్ల మధ్య ఆదివారం(ఏప్రిల్‌ 7) మ్యాచ్‌ జరుగనుంది. 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-04-2024
Apr 13, 2024, 13:56 IST
ఐపీఎల్‌-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. చంఢీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌- రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.  ఇరు...
13-04-2024
Apr 13, 2024, 13:00 IST
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గురించి న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు....
13-04-2024
Apr 13, 2024, 12:09 IST
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌-2025లో హిట్‌మ్యాన్‌...
13-04-2024
Apr 13, 2024, 10:48 IST
ఆస్ట్రేలియా యువ సంచలనం, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తన ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా...
13-04-2024
Apr 13, 2024, 10:11 IST
ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. రివ్యూ...
13-04-2024
Apr 13, 2024, 09:21 IST
ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమితో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఐపీఎల్‌-2024లో హ్యాట్రిక్‌ విజయాల తర్వాత సొంత...
13-04-2024
Apr 13, 2024, 08:38 IST
ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో మూడు వేల పరుగుల మైలురాయిని...
13-04-2024
Apr 13, 2024, 03:48 IST
లక్నో: ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్రేక్‌ వేసింది. ముందుగా బౌలర్లు,...
12-04-2024
Apr 12, 2024, 22:59 IST
ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సంచలన బంతితో మెరిశాడు. కుల్దీప్‌ అద్బుతమైన...
12-04-2024
Apr 12, 2024, 21:38 IST
ఐపీఎల్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది...
12-04-2024
Apr 12, 2024, 19:05 IST
IPL 2024 LSG vs DC Live Updates : ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఏక్నా...
12-04-2024
Apr 12, 2024, 18:57 IST
ఐపీఎల్-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో...
12-04-2024
Apr 12, 2024, 18:16 IST
ఐపీఎల్‌-2024లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క...
12-04-2024
Apr 12, 2024, 18:13 IST
ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసం...
12-04-2024
Apr 12, 2024, 16:53 IST
టీమిండియా బ్యాటర్‌, ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో క్రికెట్‌ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్బుతమైన...
12-04-2024
Apr 12, 2024, 16:06 IST
‘‘మొదటి రోజు నుంచి ఇప్పటి దాకా అతడి బౌలింగ్‌లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో అందరికంటే...
12-04-2024
Apr 12, 2024, 15:16 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్‌ 11) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ అరుదైన...
12-04-2024
Apr 12, 2024, 14:36 IST
వాంఖడే వేదికగా ముంబై, ఆర్సీబీ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌పై పలువురు క్రికెట్‌ అభిమానులు అనుమానం వ్యక్తిం చేస్తున్నారు....
12-04-2024
Apr 12, 2024, 14:00 IST
ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 12) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ...
12-04-2024
Apr 12, 2024, 13:18 IST
ఐపీఎల్‌-2024లో హ్యాట్రిక్‌ పరాజయాల అనంతరం ముంబై ఇండియన్స్‌ కోలుకున్న తీరుపై ఆ జట్టు మెంటార్‌ సచిన్‌ టెండుల్కర్‌ హర్షం వ్యక్తం చేశాడు....

మరిన్ని ఫొటోలు

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top