వయసు పెరిగినా పదును మాత్రం తగ్గలేదు

Watch Sachin Tendulkar Classic Innings In Road Safety World T20 Series - Sakshi

రాయ్‌పూర్‌: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమి లేదు. సమకాలీ క్రికెట్‌లో బ్యాటింగ్‌ లెజెండ్‌గా ముద్రించుకున్న సచిన్‌ అంతర్జాతీయ కెరీర్‌లో బ్యాటింగ్‌లో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. 463 వన్డేల్లో 18426 పరుగులు.. 200 టెస్టుల్లో 15921 పరుగులు.. వన్డే, టెస్టులు కలిపి వంద సెంచరీలు( వన్డేల్లో 49, టెస్టుల్లో 51).. ఇంకా అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో భాగంగా సచిన్‌ ఇండియన్‌ లెజెండ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఆ జట్టులో సెహ్వాగ్‌, యువరాజ్‌, కైఫ్‌, ఇర్ఫన్‌ పఠాన్‌, ఓజా తదితర ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. 

శుక్రవారం బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ తన మార్క్‌ ఇన్నింగ్స్‌ ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. సెహ్వాగ్‌ మాస్‌ ఇన్నింగ్స్‌ దాటికి సచిన్‌ ఇన్నింగ్స్‌ పక్కన పెట్టాల్సి వచ్చింది కానీ.. సచిన్‌ ఇన్నింగ్స్‌లో కొన్ని క్లాసిక్‌ షాట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సచిన్‌ చేసింది 33 పరుగులే అయినా.. అతను కొట్టిన 5 బౌండరీలు ఒక్కో కళాత్మక షాట్‌గా పరిగణించవచ్చు. బ్యాటింగ్‌ టెక్నిక్‌లో అదే స్టైల్‌ మెయింటేన్‌ చేయడం సచిన్‌కు మాత్రమే సాధ్యమైంది. వయసు పెరిగినా బ్యాటింగ్‌లో పదును మాత్రం తగ్గలేదని నిరూపించాడు. అంతేగాక ఓపెనింగ్‌ జోడిలో సచిన్‌, సెహ్వాగ్‌ తామెంత బెస్ట్‌ అనేది మరోసారి నిజం చేశాఇక మ్యాచ్‌ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్‌ అయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో నిజాముద్దీన్‌ 49 మినహా ఎవరు ఇండియా లెజెండ్స్‌ బౌలర్ల దాటికి నిలబడలేకపోయారు. ఇక ఇండియన్‌ లెజెండ్స్‌ బౌలింగ్‌లో వినయ్‌ కుమార్‌, ప్రగ్యాన్‌ ఓజా, యువరాజ్‌లు తలా 2 వికెట్లు తీయగా..మన్‌ప్రీత్‌ గోని, యూసఫ్‌ పఠాన్‌ చెరొక వికెట్‌ తీశారు. 110 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌ సెహ్వాగ్‌ మెరుపులతో 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
చదవండి:
వీరు విధ్వంసం.. 35 బంతుల్లో 80 పరుగులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top