ఆసియా కప్‌కు ముందు శ్రీలంకకు వరుస షాక్‌లు.. తాజాగా మరో స్టార్‌ ప్లేయర్‌ | Wanindu Hasaranga, Dushmantha Chameera, Lahiru Kumara, Dilshan Madushanka Have Been Ruled Out Of Sri Lanka Asia Cup 2023 Squad | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌కు ముందు శ్రీలంకకు వరుస షాక్‌లు.. తాజాగా మరో స్టార్‌ ప్లేయర్‌

Aug 29 2023 6:32 PM | Updated on Aug 29 2023 7:28 PM

Wanindu Hasaranga, Dushmantha Chameera, Lahiru Kumara, Dilshan Madushanka Have Been Ruled Out Of Sri Lanka Asia Cup 2023 Squad - Sakshi

ఆసియా కప్‌-2023కు ముందు శ్రీలంకకు వరుస షాక్‌లు తగుతున్నాయి. ఆ జట్టులోని స్టార్‌ ఆటగాళ్లంతా గాయాలు, కోవిడ్‌ కారణంగా ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతున్నారు. తాజాగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న హసరంగ పూర్తి కోలుకోకపోవడంతో లంక బోర్డు అతన్ని జట్టు నుంచి తప్పించింది.

హసరంగకు ముందు దిల్షన్‌ మధుష్క, లహీరు కుమార, దుష్కంత చమీరా కూడా గాయాల బారిన పడి ఆసియా కప్‌కు దూరమయ్యారు. పై పేర్కొన్న నలుగురు గాయాల కారణంగా జట్టుకు దూరమైతే, మరో ఆటగాడు కోవిడ్‌ కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆవిష్క ఫెర్నాండో కోవిడ్‌తో బాధపడుతూ జట్టుకు దూరంగా ఉన్నాడు. పై పేర్కొన్న ఐదుగురిని లంక సెలెక్టర్లు తొలుత ఆసియాకప్‌ కోసం ఎంపిక చేశారు. అయితే గాయాలు, కోవిడ్‌ కారణంగా వీరు జట్టుకు దూరం కావడంతో, లంక సెలెక్టర్లు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల జాబితాను ప్రకటించారు.   

ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో లంక తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఆగస్ట్‌ 31న పల్లెకెలె వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ ఆగస్ట్‌ 30న జరిగే పాకిస్తాన్‌-నేపాల్‌ మ్యాచ్‌తో ప్రారంభంకానుంది. సెప్టెంబర్‌ 2న భారత్‌-పాక్‌లు పల్లెకెలెలో తలపడనున్నాయి. సెప్టెంబర్‌ 4న భారత్‌-నేపాల్‌, సెప్టెంబర్‌ 5న శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌తో ఆసియా కప్‌ ముగుస్తుంది.

ఆసియా కప్‌-2023 కోసం శ్రీలంక జట్టు: దసున్‌ షనక (కెప్టెన్‌), కుశాల్‌ మెండిస్‌ (వైస్‌ కెప్టెన్‌), పథుమ్‌ నిస్సంక, దిముత్‌ కరుణరత్నే, కుశాల్‌ పెరీరా, చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, తహీశ్‌ తీక్షణ, దునిత్‌ వెల్లలగే, మతీశ పతిరణ, కసున్‌ రజిత, దుషన్‌ హేమంత, బినుర ఫెర్నాండో, ప్రమోద్‌ మదుషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement