
న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలరీత్యా భారత స్టార్ కోహ్లి ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. అయితే తదుపరి మూడు టెస్టులకూ కోహ్లి సేవలు జట్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఈనెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి 27 వరకు రాంచీలో జరగనున్నాయి.
చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాలలో జరగుతుంది. తాను జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై కోహ్లి బీసీసీఐకి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. కాగా తన భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే విరాట్ ఆటకు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు సమాచారం.
చదవండి: బుమ్రా నంబర్‌వన్