రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్-2026లో ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో వైభవ్ వీరవీహారం చేశాడు. కేవలం 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌ను తన విరోచిత ఇన్నింగ్స్‌తో వైభవ్ ఆదుకున్నాడు.
తొలుత కాస్త ఆచితూచి ఆడిన వైభవ్.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ చిచ్చరపిడుగు తనదైన శైలిలో గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. ముల్లాన్‌పూర్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మ
రోసారి తృటిలో తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకునే అవకాశాన్ని సూర్యవంశీ కోల్పోయాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
వైభవ్ సాధించిన రికార్డులు ఇవే
ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ఈ మైలురాయిని కేవలం 440 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. రస్సెల్ 545 బంతుల్లో 1,000 పరుగులు చేయగా.. వైభవ్ అంతకంటే 105 బంతులు తక్కువగానే ఆడి ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
అదేవిధంగా ఒక ఐపీఎల్ సీజన్‌లో పవర్ ప్లేలో 500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అతడు ఈ ఏడాది సీజన్‌లో పవర్‌ప్లేలో 233.63 స్ట్రైక్ రేట్‌తో 521 పరుగులు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో వైభవ్ కంటే ముందు ఈ ఫీట్‌ను అందుకోలేకపోయారు. వైభవ్ తర్వాత డేవిడ్ వార్నర్(467) ఉన్నాడు.
చదవండి: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం
THE VAIBHAV SOORYAVANSHI SHOW 🤩🩷
🎥 The Boy Wonder playing fire with fire 🔥
Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @rajasthanroyals pic.twitter.com/UFvfez3ORP— IndianPremierLeague (@IPL) May 29, 2026


