వైభవ్,జురేల్ ఊచకోత.. లక్నోపై రాజస్తాన్ విక్టరీ | Vaibhav-Jurel Guides Rajasthan Royals Victory By 7 Wickets Vs Lucknow | Sakshi
Sakshi News home page

వైభవ్,జురేల్ ఊచకోత.. లక్నోపై రాజస్తాన్ విక్టరీ

May 19 2026 11:40 PM | Updated on May 20 2026 7:29 AM

Vaibhav-Jurel Guides Rajasthan Royals Victory By 7 Wickets Vs Lucknow

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. ల‌క్నో విధించిన 221 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని 19.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది. వైభ‌వ్ సూర్య‌వంశీ (93) విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ (53 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ఆకాశ్ సింగ్‌, మోసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.

అంతకముందు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 ప‌రుగులు) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ఈ ఇద్ద‌రు తొలి వికెట్‌కు 109 ప‌రుగులు జోడించారు.  

అనంత‌రం వచ్చిన పూర‌న్ (16) ఎక్కువ‌సేపు నిల‌బ‌డ‌లేక‌పోయాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన కెప్టెన్ పంత్ (23 బంతుల్లో 35) ప‌ర్వాలేద‌నిపించాడు. అయితే ల‌క్నో చివ‌రి ఓవ‌ర్‌లో మూడు వికెట్లు కోల్పోయి 220 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో య‌ష్ రాజ్ 2 వికెట్లు తీయ‌గా, ఆర్చ‌ర్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఈ విజ‌యంతో రాజ‌స్తాన్ 7 విజ‌యాల‌తో 14 పాయింట్లు సాధించింది. పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో నిలిచిన రాజ‌స్తాన్ త‌మ చివ‌రి మ్యాచ్‌లోనూ విజ‌యం సాధిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాలు అవ‌స‌రం లేకుండా నాలుగో జ‌ట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరుకోనుంది. రాజ‌స్తాన్ త‌మ చివ‌రి మ్యాచ్‌ను మే 24 (ఆదివారం) ముంబై ఇండియ‌న్స్‌తో ఆడ‌నుంది.

చదవండి: వైభవ్‌ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement