IND Vs AUS: చరిత్ర సృష్టించిన ఖవాజా.. 43 ఏళ్ల రికార్డు బద్దలు! ఏకైక ఆటగాడిగా..

Usman Khawaja Breaks 43yearold Unique Record In The 4th Test Match - Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌తో జరగుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఖవాజా (180; 422 బంతుల్లో 21x4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అదే విధంగా మరో బ్యాటర్‌ కామెరాన్‌ గ్రీన్‌ (114; 170 బంతుల్లో 18x4) విరోచిత శతకం సాధించాడు.

వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌లు ఫలితంగా తమ తొలి ఇన్నింగ్‌లో 480 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ (17 బ్యాటింగ్‌) శుభ్‌మన్‌ గిల్‌ (18 బ్యాటింగ్‌) అజేయంగా ఉన్నారు.

ఉస్మాన్‌ ఖవాజా అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగిన ఆసీస్‌ ఓపెనర్‌ ఖవాజా ఓ అరుదైన ఘనత సాధించాడు.  భారత గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా బ్యాటర్‌గా ఖవాజా రికార్డుల‍కెక్కాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 422 బంతులు ఆడిన ఉస్మాన్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు.

అంతకుముందు ఈ రికార్డు ఆసీస్‌ దిగ్గజ బ్యాటర్‌ గ్రాహం యాలోప్ పేరిట ఉండేది. 1979లో ఈడెన్‌ గార్డన్స్‌ వేదికగా జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో యాలోప్ 392 బంతులు ఆడాడు. ఇక తాజా మ్యాచ్‌లో 422 బంతులు ఆడిన ఉస్మాన్‌.. 43 ఏళ్ల యాలోప్ రికార్డు బ్రేక్‌ చేశాడు. కాగా యాలోప్ తర్వాతి స్థానంలో ఆసీస్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(361) బంతులతో ఉన్నాడు. 
చదవండిIND vs AUS: క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. పరువు పోగట్టుకున్న రోహిత్‌, ‍జడ్డూ! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top