
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఐసీసీ ప్యానల్ అంపైర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ఆటగాడని, అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనిల్ చౌదరి కొనియాడాడు.
కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు. అయితే తాజాగా యూట్యూబ్ పాడ్‌కాస్ట్ షో 'అన్‌ప్లగ్డ్సలో అనిల్ చౌదరి మాట్లాడుతూ.. "రోహిత్ శర్మ బయటకు చాలా సాధారణంగా కన్పిస్తాడు.
కానీ అతడు చాలా తెలివైన ఆటగాడు. అతడిని తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదు. రోహిత్ గేమ్ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది. రోహిత్ బ్యాటింగ్ టెక్నిక్‌ను ఎవరూ అంచనా వేయలేరు. అతడు ఆడుతున్నప్పుడు 160 కి.మీ వేగంతో బంతి వచ్చినా అంది 120 కి.మీ వేగం లానే అన్పిస్తుంది.
అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ల నుంచి చాలా అప్పీల్స్ వస్తాయి. కానీ అతడి బ్యాటింగ్ స్టైల్లో ఎటువంటి మార్పు ఉండదు. రోహిత్ లాంటి ఆటగాడికి అంపైరింగ్ చేయడం చాలా సులభం.
మన నిర్ణయాన్ని ఈజీగా ప్రకటించవచ్చు. ఎందుకంటే అతడు ఎప్పుడు కన్ఫ్యూజిన్‌తో ఆడడు. హిట్‌మ్యాన్ తెలిసిందే అంతా ఒక్కటే. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు సాధించడమే అతడి లక్ష్యమని" పేర్కొన్నాడు.
చదవండి: #Babar Azam: బాబర్ ఆజం కథ ముగిసినట్టేనా.. 20 నెలల నుంచి నిరీక్షణ?