
నాగపూర్‌లో గత నెల 27 నుంచి ఈనెల 12వ తేదీ వరకు అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహించారు. అందులో మహబుబ్‌బాషా ప్రతిభ కనబరిచాడు.
ఎమ్మిగనూరుటౌన్/కర్నూలు: అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎమ్మిగనూరుకు చెందిన విద్యార్థి కె.మహబుబ్‌బాషా ఎంపికయ్యాడు. స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ విద్యార్థి క్రికెట్‌లో తన ప్రతిభ చూపి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. నాగపూర్‌లో గత నెల 27 నుంచి ఈనెల 12వ తేదీ వరకు అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహించారు. అందులో మహబుబ్‌బాషా ప్రతిభ కనబరిచాడు.
దుబాయ్‌లో డిసెంబర్ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న క్రికెట్ పోటీల్లో అండర్ 19 ఇండియా జట్టు తరఫున ఈ విద్యార్థి ఆడనున్నాడు. ఇండియన్ టీంలో స్థానం దక్కించుకున్న మహబుబ్‌బాషాను సోమవారం కళాశాల డీన్ లింగేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ అయ్యప్ప, ఏజీఎం రమణారెడ్డి, తల్లిదండ్రులు మహమ్మద్ రఫీక్, శైనాజ్, స్థానికులు అభినందించారు.
చదవండి: Ind Vs Nz 1st T20- Deepak Chahar: రోహిత్ భయ్యాతో మాట్లాడాను.. ‘హోం గ్రౌండ్’లో ఓపెనర్‌గా దిగుతా