‘నేను చూసిన క్రికెటర్లలో అతనొక పూర్తి అథ్లెట్‌’

Team India Fielding Coach Heaps Praise Shubman Gill Complete Athlete - Sakshi

భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ టీమిండియా ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. తాను ఇటువంటి క్రికెటర్‌ను చూడలేదంటూ కితాబిచ్చాడు. కాగా ఐపీఎల్‌ రాణించడంతో వెలుగులోకి వచ్చిన గిల్‌ జాతీయ జట్టులోనూ సత్తా చాటి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌  జాబితాలో గిల్‌ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

శుభమన్‌ గిల్‌ ఒక పూర్తి అథ్లెట్‌: భారత ఫీల్డింగ్ కోచ్
కేవలం ఏడు టెస్టుల అనుభవంతో శుభమన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా కొత్తవాడనే చెపాలి. గత కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ ఓపెనర్లకు ఇంగ్లండ్ పిచ్‌లు అంతటి అనుకూలం కాదు. పైగా ఈ మెగా ఈవెంట్‌లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నెర్ లాంటి పేసర్లని ఎదుర్కొనే గిల్ రాణించాల్సి ఉంటుందని శ్రీధర్‌ తెలిపారు. గిల్‌ గురించి మాట్లాడుతూ.. '' అతను సన్నగా పొడవైనవాడు, గ్రౌండ్‌లోనే చురుకుగా కదలడం, బ్యాటింగ్ పద్ధతిలోనూ లోపాలు లేవు, అలాగే ఫీల్డింగ్ పరంగానూ ఆకట్టుకుంటున్నాడు. ఇలా నేను చూసిన క్రికెటర్లలో పూర్తి అథ్లెట్ అతనేనని భావిస్తున్నట్లు'' టైమ్స్ ఆఫ్ ఇండియాతో చాట్‌లో అన్నారు.

ఈ నెలాఖరులో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడినప్పుడు చాలా మంది కళ్ళు శుబ్‌మన్‌ గిల్‌పై ఉండనున్నాయి. ఇదిలావుండగా.. డబ్ల్యుటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ వెళ్లనుంది. విరాట్ కోహ్లి జట్టు  అక్కడికి వెళ్లిన తర్వాత 10 రోజుల క్వారంటైన్‌లో గడపనున్నారు. అందువల్ల, కివీస్‌పై అంతిమ యుద్ధానికి సిద్ధం కావడానికి వారికి ఎక్కువ సమయం లభించదు.

చదవండి: దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top