 
													Hasan Ali Strikes With Stunning Throw.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ స్టన్నింగ్ త్రోతో మెరిశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను తన బౌలింగ్‌లోనే అద్భుత రనౌట్‌తో పెవిలియన్ చేర్చాడు. కివీస్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 14వ ఓవర్‌ను హసన్ అలీ వేశాడు. ఓవర్ తొలి బంతిని విలియమ్సన్ ఢిపెన్స్ ఆడాడు.

అయితే విలియమ్సన్ రిస్క్ అని తెలిసినప్పటికి సింగిల్‌కు ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కాన్వే వెనక్కి వెళ్లిపోవడంతో విలియమ్సన్ మళ్లీ వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే హసన్ అలీ వేగంగా పరిగెత్తి బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. దీంతో విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
