Suryakumar Yadav Brings Home Mercedes Benz SUV Worth Over 2 Crores - Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: ఖరీదైన కారు కొన్న టీమిండియా బ్యాటర్‌.. ధర రూ. 2 కోట్ల పైమాటే!

Aug 12 2022 7:04 PM | Updated on Aug 12 2022 8:14 PM

Suryakumar Yadav Brings Home Mercedes Benz SUV Worth Over 2 Crores - Sakshi

కారు కొన్న టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (PC: autohangar Instagram)

Suryakumar Yadav Brings Home  Mercedes-Benz SUV: కెరీర్‌లో ఉత్తమ దశలో ఉన్నాడు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. ఇటు ఆట.. అటు వ్యక్తిగత జీవితాన్నీ బాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా భార్య దేవిషా శెట్టితో ట్రిప్పులకు వెళ్తాడు సూర్య. ఇక ఈ ముంబై బ్యాటర్‌కు కార్లు అంటే మహా క్రేజ్‌. 

ఇప్పటికే అతడి గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూఈ 5 సిరీస్‌, ఆడీ ఏ6, రేంజ్‌ రోవర్‌, హుండాయ్‌ ఐ20, ఫార్చూనర్‌ వంటి కార్లు ఎన్నో ఉన్నాయి. తాజాగా మరో ఖరీదైన కారును కొనుగోలు చేశాడు సూర్య. దాదాపు 2.15 కోట్ల రూపాయల విలువైన మెర్సిడెజ్‌ బెంజ్‌ స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్‌(ఎస్‌యూవీ)ను ఇంటికి తీసుకువచ్చాడు.


 (PC: autohangar Instagram)

ముందు విఫలమైనా.. ఆ తర్వాత అదరగొట్టి!
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన నాలుగో నెంబర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. మొదటి రెండు మ్యాచ్‌లలో విఫలమైనా ఆ తర్వాత మెరుగ్గా రాణించాడు. ముఖ్యంగా మూడో టీ20 సందర్భంగా సరికొత్త రికార్డు సృష్టించాడు.


 (PC: autohangar Instagram)

ఆ మ్యాచ్‌లో 44 బంతుల్లో  8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు సాధించాడు. అలా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు.  అంతకు ముందు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసి తన విలువ చాటుకున్నాడు. ఇక ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆసియా కప్‌-2022 ఆడనున్న భారత జట్టుకు ఎంపికయ్యాడు.


 (PC: autohangar Instagram)

ఇదిలా ఉంటే.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు సుదీర్ఘ కాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా.. ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బ్యాటర్‌గా సూర్య ఏడాదికి దాదాపు 20 కోట్లపైనే సంపాదిస్తున్నట్లు అంచనా. 
చదవండి: Rohit Sharma: రోహిత్‌ శర్మ సాధించిన ఈ 3 రికార్డులు బద్దలు కొట్టడం కోహ్లికి సాధ్యం కాకపోవచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement