ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు తప్పులను సరిదిద్దుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20లు)కు లంక జట్టు కొత్త కెప్టెన్‌గా కుశాల్ మెండిస్‌ను నియమిస్తూ లంక బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు వన్డేలకు కెప్టెన్‌గా ఉన్న షనక, టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన చరిత్ అసలంకలను ఆ పదవి నుంచి తప్పించి రెండు ఫార్మాట్లలోనూ కుశాల్ మెండిస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. టెస్టు జట్టును మాత్రం ధనుంజయ డిసిల్వానే నడిపించ నున్నాడు.
పనిలో పనిగా వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు 16 మందితో, టెస్టు సిరీస్‌కు 17 మందితో కూడిన జట్లను ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయినప్పటికీ షనక, చరిత్ అసలంకలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. కమిందు మెండిస్ కుశాల్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
గాయంతో టీ20 ప్రపంచకప్‌కు దూరమైన లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ విండీస్‌తో సిరీస్‌కు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు భారత్‌తో కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన శ్రీలంక టోర్నీలో సెమీఫైనల్ చేరడంలో విఫలమైంది. చచ్చీ చెడీ సూపర్-8కు చేరుకున్నప్పటికీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ దారుణ పరాజయాలు చవిచూసింది. ఈ నేపథ్యంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్లను మార్చేందుకు లంక క్రికెట్ బోర్డు మొగ్గుచూపింది.
శ్రీలంక టూర్ ఆఫ్ వెస్టిండీస్:
జూన్ 3: మొదటి వన్డే, జమైకా
జూన్ 6: రెండో వన్డే, జమైకా
జూన్ 8: మూడో వన్డే, జమైకా
జూన్ 11: తొలి టీ20, జమైకా
జూన్ 13: రెండో టీ20, జమైకా
జూన్ 14: మూడో టీ20, జమైకా
జూన్ 25 నుంచి 29 వరకు: మొదటి టెస్టు, అంటిగ్వా
జూలై 3 నుంచి 7 వరకు: రెండో టెస్టు, అంటిగ్వా
విండీస్‌తో సిరీస్‌కు శ్రీలంక జట్టు:
వన్డే జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానాగే, చరిత్ అసలంక, మిలన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుషంక, ఇషాన్ మలింగ, అసితా ఫెర్నాండో, ప్రమోద్ మదుషన్.
టీ20 జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, లసిత్ క్రూస్‌పుల్లే, దాసున్ షనక, మిలన్ రత్‌నాయకే, దునిత్ వెల్లలగే, వనీందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుషంక,ఇషాన్ మలింగ, బినురా ఫెర్నాండో, నువాన్ తుషార.
టెస్టు జట్టు: ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, పాతుమ్ నిస్సంక, లహిరు ఉదరా, నిషాన్ మదుష్క, దినేష్ చండిమల్, పసిందు సూర్యబండార, సోనాల్ దినుషా, కుసాల్ మెండిస్, మిలన్ రత్నాయకే, ప్రబాత్ జయసూర్య, రమేశ్‌మెండిస్, అసితా ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, లాహిరు కుమారా, ఇసితా విజ్వేసుందర, కాసున్ రజిత.
Sri Lanka Tour of West Indies 2026🏏
Sri Lanka Cricket’s Selection Panel has selected the following squads for Sri Lanka’s Tour of the West Indies 2026.
The tour will feature matches across all three formats - ODI, T20I, and Test cricket.
The tour will begin with the ODI series,… pic.twitter.com/rnZYZZHm0S— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) May 25, 2026


