ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్‌.. గెలిచేది ఆ జట్టే! | SRH will have an upper hand in this game: Irfan pathan | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్‌.. గెలిచేది ఆ జట్టే!

Mar 28 2026 6:45 PM | Updated on Mar 28 2026 7:38 PM

SRH will have an upper hand in this game: Irfan pathan

ఐపీఎల్‌-2026 సీజన్‌కు స‌ర్వం సిద్ద‌మైంది. మ‌రి కాసేపట్లో ఈ ధ‌నాధ‌న్ క్రికెట్ లీగ్‌కు తెరలేవ‌నుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై ఎస్‌ఆర్‌హెచ్ పై చేయి సాధించే అవకాశముందని పఠాన్ జోస్యం చెప్పాడు. ఎస్‌ఆర్‌హెచ్ కంటే ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కాస్త వీక్‌గా కన్పిస్తోందని అతడు అభిప్రాయపడ్డారు.

కాగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్ సీజన్‌కు జోష్ హాజిల్‌వుడ్‌, నువాన్ తుషారాలు గాయం కారణంగా దూరమయ్యారు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అయినప్పటికి జయదేవ్ ఉనద్కట్‌, హర్షల్ పటేల్ వంటి సీనియర్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆర్సీబీ బౌలింగ్ పరంగా కాస్త బలహీనంగా కన్పిస్తోంది. ముఖ్యంగా హేజిల్‌వుడ్‌, యశ్ దయాల్ పేస్ బౌలర్ల సేవలను ఆర్సీబీ కోల్పోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో బెంగళూరుపై ఎస్‌ఆర్‌హెచ్ పైచేయి సాధిస్తుందని నేను భావిస్తున్నాను.

ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌నే సొంతమైదానంలో ఆడుతామని అస్సలు ఊహించిండదు. చిన్నస్వామి స్టేడియం బౌండరీలు చాలా చిన్నవి. ఇరు జట్లకు స్పిన్నర్లు కీలకం మారనున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ మరి స్పిన్నర్‌గా ఎవరిని ఆడిస్తుందో చూడాలి. ఏదేమైనప్పటికి ఎస్‌ఆర్‌హెచ్‌కే గెలిచే అవకాశాలు ఉన్నాయని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.

కాగా ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో హర్ష్ దూబే, శివాంగ్ కుమార్‌, జీషాన్ అన్సారీ వంటి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. జీషాన్ అన్సారీ గత సీజన్‌లో ఆడగా.. దూబే, శివాంగ్‌లకు ఇదే తొలిసారి. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ మరి ఎవరికి తుది జట్టులో చోటు ఇస్తుందా? అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్యాట్ క‌మ్మిన్స్ స్ధానంలో ఇంగ్లీష్ ఆల్‌రౌండ‌ర్ బ్రైడ‌న్ కార్స్‌కు చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది.
చదవండి: IPL 2026: చరిత్రకు అడుగు దూరంలో భువనేశ్వర్‌ కుమార్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement